తిరుమల సత్రాల నిర్వహణ మార్పుపై వివాదం: కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై భానప్రకాశ్ రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుమల
తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ సత్రాలు మరియు ప్రవాసీ సౌధ నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖకు బదిలీ చేయడం వివాదాస్పదమైందని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. టీటీడీ అనుమతి లేకుండా ఆదాయ వాటాలు మార్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధార్మికక్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మారిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.