రాజాపేటలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు ముదిరాజ్ సంఘం నిర్ణయం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో త్వరలోనే పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ముదిరాజ్ కుల సంఘ నాయకులు తెలిపారు. మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి విగ్రహ ఏర్పాటు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రతి గ్రామం నుంచి ముదిరాజ్ సంఘ ప్రతినిధులు, పెద్దమనుషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడిగా మేడమైన శివరాములు, ఉపాధ్యక్షులుగా పులి రాజును ఎన్నుకున్నారు.