గర్బా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భోపాల్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హుజూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ గర్బా వేడుకలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముస్లిం యువకులు గర్బా వేడుకలకు ఒంటరిగా రావద్దని, తమతో పాటు సోదరీమణులు, కుమార్తెలను కూడా వెంటబెట్టుకుని రావాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండించాయి.