శ్రీకాళహస్తిలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమన్వయకర్తల కీలక సమావేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన పార్టీ పార్లమెంటు మరియు నియోజకవర్గ సమన్వయకర్తలు, కమిటీ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగుతూ అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలు మరియు గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళికపై నాయకులు పలు కీలకమైన సూచనలు అందించారు.