షేక్ అబ్దుల్లా జయంతి సెలవులపై జేఅండ్ కే అసెంబ్లీలో దుమారం

రిపోర్టర్: శివ స్థలం: Srinagar

శ్రీనగర్ లోని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల డిమాండ్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. షేక్ అబ్దుల్లా పుట్టినరోజు, వర్ధంతిని ప్రభుత్వ సెలవుదినాలుగా ప్రకటించాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అబ్దుల్ మజిద్ లర్మి డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.