హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు అంటూ మార్కో రూబియో ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Washington
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్లోబల్ షిప్పింగ్ రక్షణ కోసం అంతర్జాతీయ దేశాలు ముందుకురావాలని తాము పదేపదే కోరినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలను రక్షించే బాధ్యత ప్రస్తుతం అమెరికాపైనే ఎక్కువగా పడిందని ఆయన స్పష్టం చేశారు.