'యుసిసి రాజ్యాంగ వ్యతిరేకం, దానిని వ్యతిరేకిస్తున్నాం': అక్బరుద్దీన్ ఓవైసీ
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
యుసిసి బిల్లు రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని ఏఐఎంఐఎం పార్టీ జాతీయ నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశ ప్రజల హక్కులను కాలరాసేలా ఉన్న ఈ నిబంధనలను ఆమోదించే ప్రసక్తే లేదని, మతపరమైన స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలపై గట్టిగా పోరాడుతామని ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా హెచ్చరించారు.