ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడం ఖాయమన్న మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తన శాసనసభ సభ్యత్వంపై సుప్రీంకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. రాబోయే ఉపఎన్నికల్లో తాను బరిలో దిగడం వంద శాతం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. అయితే ఏ పార్టీ గుర్తుపై పోటీ చేయాలనే అంశాన్ని ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.