ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆస్పత్రిలో చేరిక: ఆరోగ్య పరిస్థితి నిలకడ

రిపోర్టర్: సునీల్ స్థలం: పుణే

ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ ఛాతి నొప్పితో పుణేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దగ్గు సమస్య కారణంగా ఎనుబది ఐదు సంవత్సరాల వయసున్న ఆయన్ను రూబీ హాల్ క్లినిక్ కు తరలించినట్లు బారామతి ఎంపీ సుప్రియా సూలే వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని ఆరోగ్య సూచికలు నిలకడగా ఉన్నాయని ఆమె తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.