ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వేలమంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పిస్తోందని అధికారులు తెలిపారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా 24,042 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఒకేసారి రూ.9,798 కోట్ల విలువైన భూములకు పట్టాలు అందిస్తున్నామని, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనూ లబ్ధిదారులకు ఈ భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.