సాలూరులో ఘనంగా మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం
రిపోర్టర్: కిరణ్
స్థలం: సాలూరు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మెప్మా ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీవోఏ, ఈ-నారీ మహిళలతో చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు డిజిటల్ లావాదేవీలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. చంద్రన్న ప్రభుత్వంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.