రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో ప్రతిభ చాటిన విద్యార్థిని తేజస్విని

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పి.తేజస్విని విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఎనర్జీ బాస్కెట్ అంశంపై జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొనగా, జిల్లా తరఫున హాజరైన తేజస్విని ఉత్తమ శక్తి అంశంపై అనర్గలంగా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.