వాహనదారులకు ఊరటగా వన్ ట్యాగ్ పోర్టబిలిటీ సేవలను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ముంబై
వాహనదారులు ఇకపై ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకును మార్చడానికి వాహనానికి ఉన్న ట్యాగ్‌ను తొలగించి కొత్తది మార్చాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 వేదికగా ఆయన వన్ ట్యాగ్ పోర్టబిలిటీ సేవలను ప్రారంభించారు. ఈ కొత్త సేవ ద్వారా వినియోగదారులు పాత భౌతిక ఫాస్టాగ్ ట్యాగ్‌ను మార్చకుండానే సులభంగా వేరే బ్యాంకుకు మారే సౌలభ్యం లభిస్తుందని, దీనిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చని మంత్రి వెల్లడించారు.