కోటలో అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగిందన్న పాశం సునీల్
రిపోర్టర్: నరేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట ప్రాంతంలో నిజమైన అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు, ప్రజల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పాలనలోని ప్రాధాన్యతను ఆయన వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.