ఆసియా క్రీడల్లో సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన సుచికా తరియాల్
రిపోర్టర్: హరి
స్థలం: జపాన్
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ సుచికా తరియాల్ మహిళల ట్రెడిషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌లోకి ప్రవేశించి పతకాన్ని ఖరారు చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్ పోరులో మంగోలియా ఫైటర్ అల్టన్చిమెగ్ బైగల్మాపై 2-0 తేడాతో అద్భుత విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె సోమవారం జరిగే సెమీఫైనల్ బౌట్‌లో తలపడనున్నారు.