ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై నిప్పులు చెరిగిన కూన రవికుమార్
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలోని ఎంపీటీసీ మరియు జెడ్పీటీసి ఎన్నికల ప్రచారంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని ఘాటైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇస్తూ ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపారు. ఈ ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు.