తమిళనాడులో విజయ్ ప్రభుత్వంపై ఉత్కంఠ రేపుతున్న తొలి ఉపఎన్నికలు

రిపోర్టర్: నరేష్ స్థలం: తమిళనాడు

తమిళనాడులో తమిళగ వెట్రి కజగం అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మదురాంతకం, ధరాపురం స్థానాలకు తొలిసారిగా ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి సాంకేతిక కారణాల రీత్యా ఎన్నికలు వాయిదా పడగా, లెఫ్ట్ పార్టీలు విడిగా పోటీ చేస్తుండటం మరియు త్రిముఖ పోటీ నెలకొనడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.