పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పిల్లలు బహిరంగంగా ముఖానికి మాస్కులు ధరించడం వెనుక అసలు కారణం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Los Angeles

ప్రముఖ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ తన పిల్లలను మీడియా కంటికి చిక్కకుండా రక్షించడానికి బహిరంగ ప్రదేశాల్ లో మాస్కులు ధరింపజేసేవారని ఆయన కుమార్తె పారిస్ జాక్సన్ వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తమకు సాధారణ బాల్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే తండ్రి ఈ నిబంధన పెట్టారని, హోంవర్క్ పూర్తి చేస్తేనే వీకెండ్ లో బయటకు వెళ్లేందుకు అనుమతించేవారని గుర్తుచేసుకున్నారు.