పంజాబ్ లో ఆప్ పార్టీకి బిగ్ షాక్: బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు అసమ్మతి ఎమ్మెల్యేలు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా మరియు చేతన్ సింగ్ జౌరామజ్రా న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం ఆప్ శిబిరంలో తీవ్ర కలకలం రేపింది.