'నిధుల మళ్లింపునకు పాల్పడ్డారు': గోపాల్ కాండా నివాసాలపై ఈడీ దాడులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హర్యానా

హర్యానాలో రూ. 248 కోట్ల రియల్ ఎస్టేట్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురుగ్రామ్‌లో మాజీ మంత్రి గోపాల్ కాండా నివాసం, ఫామ్‌హౌస్‌లలో దాడులు నిర్వహించింది. వాటికా లిమిటెడ్ రియాల్టీ కంపెనీతో ఉన్న సంబంధాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై గురుగ్రామ్ జోనల్ ఆఫీస్ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలిపారు.