మంగళగిరిలో పేదలకు ఉచిత ఆస్తి హక్కుల పట్టాలు అందజేసిన మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: నరేష్ స్థలం: మంగళగిరి

మంగళగిరి కుంచనపల్లిలో మన ఇల్లు మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మరో 372 మంది పేదలకు ఉచిత శాశ్వత ఆస్తి హక్కుల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందించి వారి కలలను సాకారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని నారా లోకేష్ వెల్లడించారు.