వందేమాతరం గీతాలాపనపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య విభేదాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: జమ్మూ కాశ్మీర్
శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య వివాదం తలెత్తింది. తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని కాంగ్రెస్ సూచించగా, రాజ్యాంగబద్ధ విధిగా గౌరవిస్తామని ఎన్సీ తోసిపుచ్చింది. కూటమిలో ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.