ఖైరతాబాద్ ఉపఎన్నికలో విజయారెడ్డి వైపు కాంగ్రెస్ మొగ్గు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తోందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో పాటు ఆయనపై వ్యతిరేకత వస్తుందనే అంచనాలతో పార్టీ నాయకత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తోందని సమాచారం. అయితే దానం నాగేందర్ ను బుజ్జగించడంపైనే ఈ ప్లాన్ అమలు ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.