వర్షాలకు రాజధాని ప్రాంతం నీట మునిగిందంటూ వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలమయమైందని పేర్కొంటూ వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ వెలువడింది. పాలకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ విమర్శలను అధికార వర్గాలు తిప్పికొడుతూ తక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.