వైభవ్ సూర్యవంశీ ఆడుతాడా: స్పష్టతనిచ్చిన భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కొటక్

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

ఇషాన్ కిషన్ గాయపడటంతో రెండో టీ20లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వస్తాడనే ఊహాగానాలపై భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కొటక్ స్పందించారు. సోషల్ మీడియా డిమాండ్ల ఆధారంగా జట్టు ఎంపిక జరగదని, జట్టు ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ అద్భుతంగా రాణిస్తోందని కొటక్ కొనియాడారు.