'ఫెడ్ బోర్డు రాజకీయాలు చేస్తోంది': వడ్డీ రేట్ల పెంపుపై ట్రంప్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమెరికా

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను నాలుగు శాతానికి పెంచడంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడ్ బోర్డు సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించకుండా రాజకీయాలు చేస్తున్నారని, తన ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు. వడ్డీ రేట్లు ఒక శాతానికి మించి ఉండకూడదని తేల్చిచెప్పిన ట్రంప్, ఈ పెంపు ఆర్థిక ప్రగతికి ప్రతికూలమని ఆందోళన వ్యక్తం చేశారు.