సినిమాల్లో అసభ్యతపై ప్రముఖ నటుడు సుమన్ తీవ్ర ఆందోళన
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
సినిమాల్లో పెరుగుతున్న అసభ్యత మరియు వల్గారిటీపై ప్రముఖ నటుడు సుమన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలకు కనిపిస్తున్న అశ్లీలత సెన్సార్ బోర్డు అధికారులకు ఎందుకు కనిపించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం వస్తున్న పలు చిత్రాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా లేవని, ఇది యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, ఇప్పటికైనా సెన్సార్ బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.