ఢిల్లీలో పీజీ హాస్టళ్లపై హైకోర్టు సంచలన ఆదేశాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
సత్యనికేతన్‌లో భవనం కూలి ఏడుగురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక వారంలోగా అన్ని పీజీలు, హాస్టళ్లలో ఆడిట్ నిర్వహించాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. సరైన అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులను గుర్తించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.