విద్యుత్తు అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణ పేరుతో వినియోగదారులకు భారీ షాక్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో విద్యుత్తు వినియోగదారులకు అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. అనుమతి పొందిన గరిష్ఠ లోడ్‌ కంటే ఎక్కువ విద్యుత్తు వాడుతున్న ఇళ్లకు టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతంలో ఒక కిలోవాట్‌ అనుమతి ఉండి మూడు కిలోవాట్లు వాడుతున్న ఓ వినియోగదారుడికి అధికారులు నాలుగు వేల రూపాయలు చెల్లించాలని తాఖీదులు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడువులోపు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు.