పాలకొండలో ఎన్నికల అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ పోలీసుల తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో పోలీసు సిబ్బందితో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసులకు సహకరించాలని కోరారు.