పరిషత్ పోరుకు సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
పరిషత్ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లంతా ఉత్సాహంగా ఓటు వేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. వర్షం దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయన్నారు. 757 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తో నిఘా, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బలగాలు మోహరించారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.