విమానంలో మహిళ నగ్న హల్‌చల్.. ప్రయాణికులు తీవ్ర ఆందోళన!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
బాల్టిమోర్ నుంచి మియామీ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ నగ్నంగా తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తించింది. విమానం గాల్లో ఉండగా దుస్తులు తొలగించి గట్టిగా అరుస్తూ అటూఇటూ తిరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది అప్రమత్తమై ఆమెను బలవంతంగా సీట్లో కూర్చోబెట్టారు. మియామీలో విమానం ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.