తెలంగాణ ఆర్టీసి గుర్తింపు సంఘాల ఎన్నికల పోలింగ్ అక్టోబర్ తొమ్మిది

రిపోర్టర్: సతీష్ స్థలం: ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మిక సంఘాల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఉదయం ఆరు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. బరిలో ఆరు గుర్తింపు సంఘాలు నిలిచాయని, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారని నాయకులు తెలిపారు.