దళితులపై దాడులు అరికట్టాలి: డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరావు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 13న నిర్వహించనున్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని డీహెచ్పీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి యంగల ఆనందరావు పిలుపునిచ్చారు. మధిర పట్టణంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో దళితులపై జరుగుతున్న దాడులను, కులవివక్షను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేస్తూ సామాజిక న్యాయం సాధించేందుకు ఉద్యమాలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.