ఇంటి పైకప్పుపై చెత్త వేస్తున్న వైనం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శాంతినగర్లో గుండెబోయిన రమేష్ యాదవ్ ఇంటి పైకప్పుపై కొందరు బట్టలు, టూత్బ్రష్లు, సిగరెట్లు, బీరు సీసాలు, చెప్పులు, పల్లీల పొట్లాలు, గుట్కా ప్యాకెట్లు తదితర చెత్తను ఉద్దేశపూర్వకంగా వేస్తున్నారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసాంఘిక చర్యల వల్ల తమ నివాసంలో జీవించడం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. ఇళ్లపైకి ఇలా చెత్త వేయకుండా నిరోధించడానికి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేసి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.