బూదరాళ్లలో రైతులకు రాజ్మా విత్తనాల పంపిణీ
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల సచివాలయం ప్రాంగణంలో రైతులకు రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ గిరిజన రైతులు రాజ్మా సాగును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. అర్హులైన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు మరియు ఫోన్ నంబర్‌తో విత్తనాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఏవో, బూదరాళ్ల, మంప వ్యవసాయ సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేసి విజయవంతం చేశారు.