దువ్వూరు సమీపంలో కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరికి గాయాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం సంగం మండలం దువ్వూరు సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్‌ నుంచి నెల్లూరు ఆసుపత్రికి రోగులతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.