వీధి కుక్కల దాడిలో వృద్ధుడి దుర్మరణం.. జన్నారంలో భయాందోళన
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. మంచానికే పరిమితమైన ఓరగంటి పోషం (80) అనే వృద్ధుడిపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని వృద్ధుడిపై దాడి జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.