కృష్ణాష్టమి వేడుకలు: కృష్ణుడు వేషధారణలో చిన్నారుల సందడి!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గోపికలు, గోపాలురుగా ముస్తాబైన పిల్లలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తమ చిన్నారుల కృష్ణ వేషధారణను చూసి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందంతో మురిసిపోయారు.