'చరిత్రను వక్రీకరిస్తున్నారు': కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై BJP Telangana ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణ విమోచన చరిత్రను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్రీకరిస్తున్నాయని BJP Telangana తీవ్రంగా ఆరోపించింది. మజ్లిస్ నేతలకు భయపడి వాస్తవాలను దాచిపెడుతున్నాయని మండిపడింది. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పంతో నిజాం నిరంకుశ పాలనను కూకటివేళ్లతో పెకిలించి స్వాతంత్ర్యం సాధించిన సెప్టెంబర్ 17 మన ఆత్మగౌరవ ప్రతీక అని BJP Telangana స్పష్టం చేసింది. ఈ చారిత్రక దినాన్ని విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించింది.