పంజాబ్లో సల్మాన్ ఖాన్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ప్రకటన

రిపోర్టర్: విజయ్ స్థలం: Mumbai

పంజాబ్ ప్రాంతంలో భారీ నివాస ప్రాజెక్టును బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ప్రకటించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. జీబీ రియాల్టీ సంస్థతో కలిసి ఆయన ఈ నూతన ప్రాజెక్టును లాంచ్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు ఆయన ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆధునిక వసతులతో కూడిన విలాసవంతమైన టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం.