అనంతపురంలో అక్రమ మైనింగ్‌పై గనులశాఖ అధికారుల ఆకస్మిక దాడులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో అక్రమ మైనింగ్‌పై గురువారం గనులశాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డికి చెందిన నాలుగు టిప్పర్లు, మూడు ట్రాక్టర్ కంప్రెషర్లను అధికారులు సీజ్ చేశారు. కేంద్ర గనుల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు అందడంతో కర్నూలు రీజియన్ మైన్స్ విజిలెన్స్ ఏడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.