హైదరాబాద్లో భారీ కలకలం: ఆపరేషన్ కవచ్ పేరుతో అర్ధరాత్రి మెరుపుదాడి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరుతో అర్ధరాత్రి భారీ తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. జోనల్ డీసీపీల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వందలాది వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని, రాత్రి వేళల్లో ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.