కూటమి సర్కారు వైఫల్యాలపై నిప్పులు చెరిగిన ఉమా శంకర్ గణేష్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎంబిపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమా శంకర్ గణేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గానికి తొమ్మిది వందల కోట్లు బాకీ ఉన్నారని, మహిళలకు ఇస్తామన్న పదిహేను వందల రూపాయల హామీని విస్మరించారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జడ్పిటిసి అభ్యర్థి అంకంరెడ్డి సౌమ్యను, ఎంపీటీసి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన స్థానిక ఓటర్లను కోరారు.