ఎన్నికల హామీలను గాలికొదిలేశారంటూ కాంగ్రెస్ పాలనపై విజయసింహారెడ్డి తీవ్ర మండిపాటు

రిపోర్టర్: రాజేష్ స్థలం: కోదాడ

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి విజయసింహారెడ్డి ఆరోపించారు. కోదాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు నిరంతర విద్యుత్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పట్టభద్రులకు పిలుపునిచ్చారు.