పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: Chennai
చెన్నైలోని తిరుమియూర్ గాంధీగ్రామ్ ప్రభుత్వ మధ్య పాఠశాలలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం విస్తరణను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి సీఎం విజయ్ అల్పాహారం స్వీకరించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల హాజరును పెంచేందుకు, పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.