గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ గురురాజా ప్రమాణ స్వీకారం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ గురురాజా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు, లోకేష్‌ల సహకారంతో నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఎన్నారైలు క్రియాశీల పాత్ర పోషిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశం మారినా తన పార్టీ, సిద్ధాంతం మారలేదని, జీవితం అమెరికాలో ఉన్నా మనసు తెలుగుదేశంతోనే ఉంటుందని గురురాజా భావోద్వేగంగా పేర్కొన్నారు.