దిల్జిత్ దోసాంజ్ ప్రశంసలపై హర్షం వ్యక్తం చేసిన గోవిందా

రిపోర్టర్: హరి స్థలం: ముంబై

ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ తనను లెజెండరీ ఆర్టిస్ట్‌గా అభివర్ణించడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. దిల్జిత్ ఎత్తుకు ఎదుగుతాడని తాను ఎప్పుడో ఊహించానని తెలిపారు. తన రాబోయే 'రూప' సినిమాతో గోవిందా రీఎంట్రీ ఇస్తున్నారు. దిల్జిత్ తనను ప్రశంసించడం సంతోషంగా ఉందని, ఆయన మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.