రోడ్డు ప్రమాదంలో విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ దుర్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చినభోగిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఎల్.శ్రీనివాసరావు మృతి చెందారు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కుమార్తె వివాహం నిశ్చయమైన తరుణంలో ఆయన మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.