రాష్ట్రస్థాయి పోటీలకు ముచ్చివోలు విద్యార్థులు: రగ్బీ టేబుల్ టెన్నిస్ జట్లలో ఎంపిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ మరియు టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్ పందొమ్మిది విభాగంలో పవన్ కుమార్, అండర్ పద్నాలుగు బాలికల విభాగంలో చెంచులక్ష్మి, జస్మిత మహేశ్వరి టేబుల్ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించారు. అలాగే రగ్బీ అండర్ పదిహేడు విభాగంలో చరణ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు కిషోర్ వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.